New
Nandamuri Taraka Ramarao (NTR)
Industry : Telugu
Biography:

పద్మశ్రీ నందమూరి తారక రామారావు

పుట్టినతేది: 28 మే 1923
తండ్రి పేరు: నందమూరి లక్ష్మయ్య చౌదరి
తల్లి పేరు: వెంకట రామమ్మ
భార్య పేరు: బసవ తారకం (వివాహం జరిగినది 1942)
కుమారులు: స్వర్గీయ్య రామకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, సాయికృష్ణ, జూ.రామకృష్ణ, జయశంకర్ కృష్ణ
కుమార్తెలు: శ్రీమతి ఉమా మహేశ్వరి, శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి లోకేశ్వరి, శ్రీమతి పురందరేశ్వరి.

నటునిగా, ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్న స్వర్గీయ్య నందమూరి తారక రామారావు తన నటనతో రాజకీయ సామర్ధ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశారు. కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే సంస్కృతశ్లోకాలు, పద్యాలూ, పెద్దబాలశిక్ష అవపాసన పట్టి, సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరు లోను విద్యాబ్యాసం కొనసాగించారు. తరవాత కొంతకాలం విజయవాడలో ఉద్యోగ భాద్యతలు కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు. నటన మీద ఆసక్తితో సోదరుడు త్రివిక్రమరావుతో కలసి 'నేషనల్ ఆర్ట్ దియేటర్' పేరిట సంస్థను స్థాపించి నాటకలు ప్రదర్శించేవారు. ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ 'మనదేశం' చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధపాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలోనటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాయించిపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కధానాయకుడిగా నిలిచిపోయారు.
 
1982 లో తెలుగువాడి ఆత్మబిమానానికి జరిగిన అవమానాన్ని ప్రాతిపదికగా తీసుకుని సినీరంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే  ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలోనటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామరావు 1996 జనవరి 18 న గుండెపోటుతో పరమపదించారు.

Supergoodmovies.com is a hindi cinema,tamil cinema,telugu cinema and kannada movies portal with Bollywood film news,kollywood film news, tollywood film news, sandalwood film news, movie news, actress gallery, movie gallery, spicy gallery, trailers,tamil movie reviews, telugu movie reviews, telugu cinema rating, box office collections and movies hit or flop, read and know your favorite actors interview videos, songs - movies review, movie reviews, music reviews, cinema gallery and many more. It's a complete hindi cinema tamil cinema, telugu cinema and kannada movies database.

Our Business Promoters:

Copyright © 2013 supergoodmovies.com. All rights reserved.