New
Gopichand
Industry : Telugu
Biography:

గోపిచంద్

పుట్టినతేది: 12 జూన్ 1979   
ఇతరపేర్లు: తొట్టెంపూడి గోపీచంద్
తండ్రిపేరు: స్వర్గీయ శ్రీ టి. కృష్ణ

సమాజంలో పేరుకుపోయిన సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని విప్లవాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న టి. కృష్ణ వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయిన గోపి చంద్ పుట్టుక, బాల్యం, ప్రాధమిక విద్య మద్రాస్ లో కొనసాగింది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపి ఫై చదువులకోసం రష్యా వెళ్ళాడు. మొదట్లో నటన మీద పెద్దగా ఆసక్తి చూపని గోపి, అక్కడ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో తండ్రి వారసత్వాన్ని పుణికి  పుచ్చుకుని దర్శకుడుగా తోలి అడుగులు వేస్తున్న అన్న ప్రేమచంద్ హటాత్ మరణం, అన్నని కడసారి చూసుకోవడానికి కూడా వీలు కుదరక పోయడం వంటి అంశాలు గోపి ఆలోచన విధానాన్ని మార్చేసాయి. గొప్ప దర్శకుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న తన తండ్రి ఉనికిని తెలుగు నాట చెరిగి పోనివ్వరాదని నిర్ణయించుకుని సినీరంగప్రవేశం చేసాడు. కాకపోతే తండ్రి సిద్దాంతాలను వంటబట్టించుకోకుండా ప్రస్తుత సినిమా పోకడలకు అనుగుణంగానే తన నాట జీవితాన్ని ఆరంబించాడు.

తమ సొంత బ్యానర్ ఈతరం ఫిల్మ్స్ ఫై 2001 లో 'తొలివలపు' చిత్రం తో హీరోగా పరిచయమం అయ్యాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో నిరాస చెందారు. కానీ గోపి లోని టాలెంట్ ను గుర్తించిన తేజ తన జయం సినిమాలో 'విలన్ గా ఆవకాశం ఇచ్చి గోపిని ప్రోత్సహించాడు. జయంలో అద్భుత నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తరవాత చేసిన 'నిజం', 'వర్షం'  వైవిద్యంగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. అదే సమయంలో సొంత బ్యానర్ లో 'యజ్ఞం' సినిమాతో తిరిగి హీరోగా రి- ఎంట్రీ ఇచ్చాడు. యజ్ఞం హిట్ అవడంతో గోపి హీరోగా స్థిరపడ్డాడు. నటనలో ప్రవేశించే ముందు ఒక సంవత్సరం పాటు నేర్చుకున్న డైలాగ్ మాడ్యులేషన్ కోర్స్ నటుడి గా మారిన తరవాత గోపీచంద్ కు పెద్ద ప్లస్ అయ్యింది. మంచి ఎత్తుతో, దృడమైన దేహ దారుడ్యంతో, చురుకైన చూపులతో. స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్ హీరోకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న గోపిచంద్ ఆనతి కాలంలోనే తెలుగు సినిమాలలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. యజ్ఞం తరవాత 'రణం' , 'లక్ష్యం' 'సౌర్యం' వంటి చిత్రాల విజయంతో మాస్ ప్రేక్షకులను అలరించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు.  2010 లో 'గోలీమార్' చిత్రం తో పరవాలేదనిపించిన గోపీచంద్ కొత్త సంవత్సరంలో 'వాంటెడ్' తో విజయాన్ని నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

Supergoodmovies.com is a hindi cinema,tamil cinema,telugu cinema and kannada movies portal with Bollywood film news,kollywood film news, tollywood film news, sandalwood film news, movie news, actress gallery, movie gallery, spicy gallery, trailers,tamil movie reviews, telugu movie reviews, telugu cinema rating, box office collections and movies hit or flop, read and know your favorite actors interview videos, songs - movies review, movie reviews, music reviews, cinema gallery and many more. It's a complete hindi cinema tamil cinema, telugu cinema and kannada movies database.

Our Business Promoters:

Copyright © 2013 supergoodmovies.com. All rights reserved.